Saturday, December 21, 2024

ఎపిలో కలకలం.. సంచలనంగా మారిన పవన్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. మహిళల అక్రమ రవాణాకు కొందరు వాలంటీర్లు సహకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏలూరు వారాహి యాత్రలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సురేష్ అనే వాలంటీర్ కృష్ణ లంక పోలీసులకు పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశాడు. సురేష్ ఫిర్యాదును 405/2023 కింద స్వీకరించిన పోలీసులు పవన్ కళ్యాణ్‌పై ఐపిసి సెక్షన్ 153, 153 ఎ, 502 (2) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News