ఆదిలాబాద్ : సిఎం కెసిఆర్ రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా ఔర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం స్ఫూర్తినిస్తా ఉంటే అదే కిసాన్ రైతుల పట్ల రేవంత్ రెడ్డి విషం చిమ్మడం ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కష్టపడే రైతుల పట్ల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనీస కనికరం లేకుండా రైతులకు ఉచిత కరెంట్ అవసరమా అంటూ ఎద్దేవా చేసి మాట్లాడాన్ని నిరసిస్తూ నేడు బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చేసున్న కుట్ర పూరిత చర్యలను వివరించారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి జాతీయ రహదారి పై దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్ర బాబు నాయకుడు తొత్తుగా వ్యవహరిస్తూ , అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులను అవమానించి మాట్లాడడం జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి మనస్సులోని మాటను తనకు తానే బయట పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడన్నారు. 70 శాతం ఉన్నటువంటి రైతాంగాన్ని కాంగ్రెస్ నేతలు ఇలా అవమానించి మాట్లాడడం తగదన్నారు. రైతుల మీద విషం చిమ్మడం బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండి స్తోందన్నారు.
అలాగే బిజెపి నాయకులు రైతుల పక్షనా నిలబడి నిరసనలు చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. దీని ద్వారా బీ టిమ్ పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహార్,వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణ అధ్యక్షులు అజయ్, రైతు సమన్వయ అధ్యక్షుడు రోకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మొట్టు ప్రహ్లాద్, సాజీతోద్దిన్, ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, శివకుమార్, తదితరులు ఉన్నారు.