Monday, December 23, 2024

నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలమ్మ

- Advertisement -
- Advertisement -
  • బోనమెత్తిన ప్రతి మహిళ కెసిఆర్‌ను దీవించాలి
  • బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు

పటాన్ చెరు: నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని అమ్మవారిని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ వేడుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గురువారం నీలంమధు పటాన్‌చెరు పట్టణంలోని గోనెమ్మ భస్తి ,ముదిరాజ్ భవనం సమీపంలోని పోచమ్మ ఆలయంను దర్శించుకొని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా పండుగలు నిర్వహిస్తుండండతోనే ప్రజలంతా సంతోషంగా పడుగలు జరుపుకుంటున్నారని చెప్పారు. ఆతల్లి దీవెనలతో ముచ్చడగా మూడవ సారి కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడన్నారు. బోనమెత్తుకున్న మహిళలంతా ముఖ్యమంత్రిని దీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి నర్సింహులు, మెట్టు కృష్ణ, తులసీదాసు, అశోక్, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News