పాల్వంచ టౌన్ : తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు చేస్తున్న ధీక్షలు గురువారం ఎనమిదవ రోజుకు చేరుకొన్నాయి. దీక్షా శిబిరాన్ని ఏఐటియుసి నాయకులు సంధర్శించి తమ పూర్తి సంఘీభావం తెలిపారు. అనంతరం నరాటి మాట్లాడుతూ … కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావంతో గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తుందన్నారు.
దీనితో ప్రజలు రోగాల భారిన పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పంధించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా మండల పరిధి 36 పంచాయతీలకు చెందిన కార్మికులు కళ్ళకు నల్ల రిబ్బన్‌లు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు రెడ్డిమళ్ళ భిక్షం, శ్రీను, పూర్ణ, రాము, వెంకన్న, మేక శ్రీను తదితరులు పాల్గొన్నారు.