Saturday, November 23, 2024

చీతా తేజాస్ మరణంపై ఆసక్తికర విషయాలు

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో బుధవారంనాడు చనిపోయిన చీతా తేజాస్ మరణంపై ఆసక్తికర విషయం వెలుగుచూసింది. పోస్ట్ మార్టమ్ రిపోర్టు విడుదల చేసిన వన్యప్రాణి వైద్యులు తేజాస్ షాక్ తో మరణించిందని తెలిపారు. ఒక ఆడ చిరుతతో పోరాడిన తేజాస్ కు గాయాలయ్యాయని వివరించారు. అప్పటికే బలహీనంగా ఉన్న తేజాస్ శత్రువును గట్టిగా ప్రతిఘటించలేకపోయిందని వైద్యులు వెల్లడించారు.

అదే సమయంలో చీతాకు కిడ్నీ, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్
సోకిందని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో మెడపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు. నాలుగు నెలల వ్యవధిలో ఏడు చీతాలు మరణించడం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే నమీబియా నుంచి తీసుకొచ్చి వదిలిన ‘జ్వాలా’ అనే చీతాకు మూడు పిల్లలు పుట్టడం ఆనందానికి గురి చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News