Monday, November 18, 2024

అభివృద్ధికి ఆకర్శితులైయ్యే బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : సిఎం కెసిఆర్ రాష్ట్రాభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి చేస్తున్న కృషిని చూసే నేడు ఎంతో మంతి ఇతర పార్టీల నుండి వచ్చి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్‌పల్లిలోని ఎంఎల్‌ఏ కార్యాలయం వద్ద చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా గ్రామంలో పద్మశాలి సంఘం భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ఎంఎల్‌ఏ వారికి హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా అ నేక అభివృద్ధి ప నులు చేపట్టామని తె లిపారు. పార్టీలో చేరిన వారిలో జెల్ల యాదగిరి, జెల్ల పురుషోత్తమ, గంజి నరసింమ, జెల్ల వెంకటేశం, రాపోలు అండాలు , జె ల్ల మీనమ్మ, జెల్ల అనంతరాములు తదితరులున్నారు. గ్రామ సర్పంచ్ మర్రి జలేందర్‌రెడ్డి,బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వెల్మినేడు సబ్‌స్ఠేషన్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎంఎల్‌ఏ..
రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరాపై పిసిసి ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కెటిఆర్ ఆదేశాల మేరకు మండలంలోని వెల్మినేడు గ్రామ సబ్ స్ఠేషన్ వద్ద నకిరేకల్ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నన్నాళుల రైతాంగం యావత్తు విద్యుత్ సరఫరాలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరి తెలుసునని అన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సునిత, జడ్‌పిటిసి ధనమ్మ , రాచకొండ కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News