- Advertisement -
- హాజరైన మంత్రి తలసాని, ఎంపి వెంకటేష్
తాండూరు: తాండూరులో ఎమ్మెల్యే నివాసంలో పదకొండు రోజుల పాటు కొనసాగిన అతిరుద్ర మహాయాగం ముగిసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ రాజశ్యామల శత చండీ సౌర లక్ష్మిసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో గురువారంతో ముగిసింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు ప్రమోదినిరెడ్డి, విఠల్‌రెడ్డి, సోదరుడు రితీష్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరిరోజు యాగంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపి వెంకటేష్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.
- Advertisement -