Friday, November 22, 2024

విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ కృషి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృ షి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నా రు. గురువారం ధరూర్ మండలం ఉప్పేరు జడ్పీహెచ్‌ఎస్ నుం చి ధరూర్ మండల కేంద్రానికి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆ ర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అనంతరం ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల నందు విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్షం వల్ల ప్రభుత్వ పా ఠశాలలు నిర్లక్షానికి గురైనట్లు, విద్యా సౌకర్యం లేక గ్రా మీణ ప్రాంత విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే వారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధ్దించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అన్ని వర్గాలకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయి విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తు ందన్నారు. మండల కేంద్రంతో పాటు, గద్వాల పట్టణంలో వి ద్యనభ్యసిస్తున్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా ఆ ర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు బస్సుపాస్ సౌకర్యానికి కల్పి ంచినట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్క విద్యార్థి లక్షాన్ని పె ట్టుకొని భవిష్యతులో అత్యున్నతస్థాయికి ఎదిగి అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూరెడ్డిపల్లి గ్రామ సర్పంచు బండ్ల జ్యోతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ, ఎంపీపీ నజ్మునిసాబేగం, జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, గద్వాల ఆర్టీసీ డీఎం శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్, ఎంఈఓ సురేష్, హెచ్‌ఎం ప్రతాప్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News