Saturday, December 21, 2024

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్త కాసమోళ్ల కనకయ్య బుధవారం రాత్రి అ నారోగ్యంతో మృతి చెందాడు. గజ్వేల్ ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ద్వారా వి షయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని గురువారం పంపించారు. ఆ కుటుంబానికి తన సానుభూతిని మంత్రి వ్యక్తం చేశారు. మంత్రి పంపిన ఆర్థిక సహాయాన్ని మాదాసు శ్రీనివాస్, ఫ్యాక్స్ ఛైర్మన్ వెంకటేష్ గౌడ్‌తో కలిసి మృతుని కుటుంబానికి అందచేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌కి మృతుడు కనకయ్య అంకిత భావంతో సేవలు అందించాడని, పార్టీ ఒక మంచి కార్యకర్తను కోల్పోయిదన్నారు. బిఆర్‌ఎస్‌కి కనకయ్య లేని లోటు తీరనిదన్నారు. కనకయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉపాధ్యక్షుడు కృష్ణాగౌడ్,మండల బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, నాయకులు మాధవ రెడ్డి, గాలెంక శ్రీను, పోచయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News