Friday, November 15, 2024

ఫ్రాన్స్‌నుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్స్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంనుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్ జెట్ విమానాలు, మూడు ఫ్రాన్స్ రూపొందిన స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనలకు భారత రక్షణ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి(డిఎసి) ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నౌకాదళంలో ఉపయోగించడానికి వీలుగా ఉండే ఈ 26 రాఫెల్‌ఎం జెట్ విమానాల్లో నాలుగు విమానాలు ట్రైనర్ విమానాలుగా ఉంటాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందంపై సంతకాలు జరిగిన మూడేళ్లలో విమానాల డెలివరీ ప్రారంభమవుతుందని ఆ వర్గాలు తెలిపాయి.

విమానాల ధరపై చర్చలు లాంటివి ఇంకా చేపట్టాల్సి ఉన్నందున తుది ఒప్పందం ఖరారు కావడానికి దాదాపు ఏడాది సమయం పట్టవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ‘ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఆధారంగా భారత నౌకాదళం కోసం ఫ్రెంచ్ ప్రభుత్వంనుంచి 26 రాఫెల్ మెరైన్ విమానాలతో పాటుగా ఇతర పరికరాలు, ఆయుధాలు, సిబ్బంది శిక్షణ తదితరాలు పొందడానికి సంబంధించిన ప్రతిపాదనలకు డిఎసి అవసరమైన అంగీకారాన్ని తెలియజేసింది’ అని ఆ ప్రకటన తెలిపింది. శుక్రవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో ప్రధాని మోడీ చర్చల అనంతంరం రక్షణ కొనుగోళ్ల ప్రాజెక్టుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News