భీమదేవరపల్లి : అదిఒక కుగ్రామం పొద్దు పొడువగానే కీచురాల్ల చప్పుళ్ళు, లేగదుడల అరుపులు , అన్న, తమ్ముడు అక్క,చెల్లి, బావా, మామా అని వరుసులతో పిలుచుకుంటు రోజును ప్రారంబించే ఆ పల్లే ప్రజలు నేడు కక్షలతో రగిలిపోతున్నారు. ఆత్మహత్యలు , నిత్యం గొడవలు ఒకరిని ఒకరు చూసి ఓర్వలేని విధంగా ఎందుకు మారారు..? వివరాల్లోకి వేల్తే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ గ్రామానికి అనుసందాన పల్లె కొత్తపల్లె ఆపల్లెలో నివసించే వారంతా ఒకే సామాజిక వర్గనికి చెందిన వారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే , సాదాబైనామా ఆగ్రామ ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తోక్కుతూ రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలతో భూముల పట్టాలు తారుమారు కావడంతో అక్కడ ఉన్నరైతులకు విబేధాలు వచ్చాయి.
ఉదాహరణకు రెండెకరాలు ఉన్నరైతుకు 10 ఎకరాల పట్టా పాస్ పుస్తకం , 10 ఎకరాలు ఉన్న రైతుకు 2 ఎకరాలు , తాతలు తండ్రుల నుండి నాగుచేసుకుంటున్న భూమిని వేరేవారికి పట్టచేయడం వంటి అంశాలు జరుగడంతో, లేకున్న భూమి వారికి సంక్రమించడం కారణంగా వారు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. నిజమైన లబ్ధిదారులు మాత్రం నష్టపోతున్నారు. వెనకటి పెద్దమనుషులు అంటున్న మాట ఇది మనభుమి కాదు మనము ఇప్పటి వరుకు అన్యాంగా బ్రతికామనే పేరు లేదు బిడ్డా ఎవరి భూమిని వారికి పట్టా చేయాలని హితవుపలికిన తల్లి దండ్రును భూమిపై ఉన్న దురాశతో దూరం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కాని పెద్దమనుషులు మాత్రం మనదికానిది మనకు వద్దు అని చెప్పినందుకు తండ్రిని చితక బాధిన తనయులు ఉన్నారు. వీరి ఈ దుస్థితి రావడానికి గత కారణం ఏమిటి అని మన తెలంగాణ దినపత్రిక పతినిధి ఆరాతీగా రెవెన్యూ కార్యలయంలో పనిచేసే ఓ ప్రైవేటు వ్యక్తి కారణం అని తెలిసింది.
ముందుగా నిజమైన పట్టాదారునీ భూమిని నీకు పట్టా చేయాలంటే కొంత ఖర్చు అవుందని తెలుపడంతో మాభూమిని మాకు పట్టాచేయాలంటే నీకు ఎందుకు డబ్బులు ఇ్వలని నిలదీయగా సదరు ప్రైవేటు ఉద్యోగి ముస్తాఫాపూర్‌కు చెందిన కొందరు వ్యక్తులను దళరులుగా ఏర్పటుచేసుకుని లబ్ధిదారులు కాని వారికి పట్టాలు ఇప్పించడంతో పల్లె ప్రజల్లో ఆదోళన మెదలైది. ఇప్పటికైనా అధికారుల మేల్కోని మాకు న్యాం చేయాలని అక్కడి రైతులు కోరుకుంటున్నారు.