Monday, December 23, 2024

పశు వైద్య కళాశాలలో బదిలీల రగడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పశు వైద్య కళాశాల జరిగిన ట్రాన్స్ఫర్ పాలసీని పక్కన పెడుతూ పారదర్శకతలేని కులవివక్షపూరితమైన బదలీలను ఉపాధ్యాయుల సంఘం గత వారం రోజులుగా విశ్వవిద్యాలయ ఉపకులపతి , యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఉపకులపతి ఉపాధ్యాయ సంఘాన్ని కలవడానికి విముఖత చూపించడంతో ఉపాధ్యాయ సంఘం ఉపకులపతి పేశీ వద్ద గురువారం శాంతియుత నిరసన తెలిపింది. ఉపాధ్యాయ సంఘం ఏ సమస్య పరిష్కారం కోసం ఉపకులపతి దగ్గరకు వెళ్ళినా, కనీసం వారిని కలిసే అవకాశం కూడా ఇవ్వకపోగా యూనివర్సిటీలోకి ఉపాధ్యాయులను రానివ్వకుండా గేట్లు వేశారని ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపించారు.

మూడు గంటల నిరసన తర్వాత ఉపకులపతి ఉపాధ్యాయ సంఘంతో చర్చలు జరిపి తన వివక్షపూరిత బదిలీలను సమర్థించుకున్నారని తెలిపారు. ఈ వైఖరిని ఏకీభవించని ఉపాధ్యాయ సంఘం తదుపరి కార్యాచరణ రూపకల్పనలు చేసినట్టు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాలేజీ గేట్ నుండి కాలేజీలో ఉన్న ;పి.వి. నరసింహారావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తూ అసోసియేట్ డీన్ చాంబర్ ముందు శాంతియుత నిరసన కార్యక్రమం, సహాయ నిరాకరణ లో భాగంగా కాలేజీ అధికారిక విధులైన అదనపు బాధ్యతలు,హానరరీ పొజిషన్స్, గౌరవ విధులను కమిటీల లో సభ్యత్వాన్ని త్యజించనున్నట్టు తెలిపారు. కులవివక్షపూరిత బదిలీలను రద్దు చేసేంతవరకు మనుముందు మరింత తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులైన గవర్నర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, బోర్డ్ మెంబర్స్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News