Monday, December 23, 2024

విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి: అధికారులకు టిఎస్ ఎన్‌పిడిసిఎల్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్ బకాయిలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి బిల్లింగ్ వసూళ్లు జరిగేలా చూడాలని టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్ రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ మీటర్లను తనిఖీలు చేసి కాలిపోయిన , పని చేయని మీటర్లను మార్చాలని , నష్టాలు ఉన్న విద్యుత్ ఫీడర్లను గుర్తించి నష్టాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు . గురువారం ఈ మేరకు టిఎస్ ఎన్‌పిడిసిఎల్ కార్పోరేట్ కార్యాలయములో సంస్థ డైరెక్టర్లు బి. వెంకటేశ్వరరావు, పి.గణపతి, కరీంనగర్ , పెద్దపల్లి , జగిత్యాల సర్కిళ్ల ఎస్.ఈలు, డిఈలు, ఏడిఈలు, ఏఈలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో సిఎండి అన్నమనేని గోపాల్ రావు మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లు ఫేయిల్యూర్లు కాకుండా ఎప్పటికప్పుడు లోడ్ చెక్ చేసుకుంటూ వాటి పై లోడ్ భారం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు . రోలింగ్ స్టాక్ పెంచుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు డిపార్ట్మెంట్ వెహికల్‌లోనే చేపట్టాలని అన్నారు . వర్షకాలం కావున విద్యుత్ అంతరాయాలపై దృష్టి పెట్టి బ్రేక్ డౌన్ , ట్రిప్పింగ్స్ కాకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఉద్యోగులకు నిర్దేశించిన నివాస స్థలంలో ఉండాలని..వర్క్ ఆర్డర్స్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News