Monday, December 23, 2024

ప్రేమ విఫలం కావడంతో దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: ప్రేమ విఫలం కావడంతో యువతి దుర్గం చెరువులో కేబుల్ బ్రిడ్జ్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా సాదిపూర్ కు చెందిన పాయల్ (20) జూబ్లిహిల్స్ లో నివాసముంటుంది.

తన స్నేహితురాలు భాగ్యశ్రీ తో కలిసి గురువారం కేబుల్ బ్రిడ్జ్ కి వచ్చిన పాయల్ భాగ్యశ్రీకి కనిపించలేదు. దాంతో పాయల్ కనిపించడం లేదని తన స్నేహితురాలు పోలిసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలిసులు పరిశీలించగా అమే దుర్గం చెరువులో దూకినట్లు నిర్ధారించారు. అనంతరం యువతి మృతదేహం కోసం డీఆర్‌ఎప్ మరియు ఫైర్ సిబ్బందితో దుర్గం చెరువులో గాలిస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతో యువతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలిసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News