Saturday, December 21, 2024

కల్వకుర్తి పోలీస్ సేవలు భేష్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : శాంతి భద్రతల పరిరక్షణలో కల్వకుర్తి పోలీసుల సేవలు భేష్ అని నాగర్‌కర్నూల్ జి ల్లా ఎస్పి మనోహర్ అన్నారు. గురువారం ఆయన కల్వకుర్తి పోలీస్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన సిఐ, ఎస్సైల కార్యాలయంలో రికార్డ్‌లను పరిశీలించారు. అనంతరం డిఎస్పి కార్యాలయంలో ఎస్పి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఎస్పి మనోహర్ అన్నారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించా రు.

వచ్చిన ఫిర్యాదులపై వెంటనే బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమస్యలు సృష్టి ంచే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్టేషన్ పర ంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.
* గిరిబాబు సేవలు అభినందనీయం
కల్వకుర్తి డిఎస్పి గిరిబాబు అందించిన సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పి మనోహర్ అన్నారు. ఇటీవల ఆయన బదిలీపై నల్గొండ జిల్లా దేవకరొండకు వెళ్లారు. ఈ సమావేశంలో సిఐలు ఆంజనేయులు, రాం నర్సయ్య, ఎస్సైలు రమేష్, కురుమయ్య, రవి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News