భోపాల్: టమాటాల ధరలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కిలో టమాటాల ధర రూ.120 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది. టమాటాల కొనడానికి పేద, మధ్య తరగతి ప్రజలు వణుకుతున్నారు. టమాటాలు అనే కూరగాయ ఉన్నదనే విషయం నెల రోజుల నుంచి ప్రజలు మరిచిపోయారు. పెట్రోల్ రేటు కంటే ఎక్కువగా టమాట ధర ఉంది. కిలో టమాట కొనుగోలు చేయడం కంటే కిలో చికెన్ కొనడం బెటర్ అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు.
Also Read: ప్రాణం తీసిన ఆక్సిజన్ మాస్క్
టమాటాలతో భర్త కూర చేశాడని అతడిని విడిచి భార్య పరాపోయిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శహడోల్ జిల్లా ధన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సందీప్ బర్మన్ అనే వ్యక్తి చిన్న దాబా నడుపుతున్నాడు. నాలుగు రోజుల క్రితం టమాటాలతో కూర వండడంతో భార్య అతడిపై అలిగింది. తన కూతురుతో కలిసి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో తన భార్యను వెతికి పెట్టాలని పోలీసులను కోరాడు. బర్మన్ సతీమణిని వెనక్కి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.