Friday, November 22, 2024

సిఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: గుత్తా

- Advertisement -
- Advertisement -

నల్గొండ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్ పై అసత్య ప్రచారం మానుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  బషీర్ బాగ్ కాల్పులకు కారణం సిఎం కెసిఆర్ అనడం అవగాహన లేదని అర్థమవుతుందన్నారు. తొమ్మిదేళ్లలో ఎకరం పంట ఎక్కడైనా ఎండిందా, సబ్ స్టేషన్ల ఎదుట ధర్నాలు జరిగాయా? అని అడిగారు. కరెంటు నిరంతరాయంగా వస్తున్నందునే అసెంబ్లీలో ఎవరూ మాట్లాడడం లేదని, కరెంటు కొనుగోళ్లు జరిగేది ఎన్ఎల్ డిసి నుంచి అని, అవినీతి జరిగిందనడం అవివేకమన్నారు.

Also Read: ఎంత పని చేశావ్ టమాటా… కూర వండిన భర్త… భార్య కనిపించడం లేదు

రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని గుత్తా చురకలంటించారు. హవాలా నంబర్ 1 స్థిమితం లేని వెంకట్ రెడ్డి వ్యవసాయం పేరుతో బావుల దగ్గరికి పోయేది సురా పానకం కోసమేనని విమర్శించారు.  82 ఏళ్ల ఖర్గే ఎఐసిసి ఉండొచ్చు కానీ రిటైర్డ్ అయినా సమర్థత ఉన్న అధికారులు ఉద్యోగంలో కొనసాగకూడదా? అని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో సిఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని సవాలు విసిరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News