Monday, November 25, 2024

ఆ రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జపాన్ వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటున్నానని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వవెళ్లి ఇండస్ట్రియల్ పార్కులో డైపు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. రూ.450 కోట్లతో డైపు సంస్థ రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. 800 మందికి డైపు సంస్థ ఉపాధి కల్పించనుంది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తైయిక్ష అనే ఇంజినీరింగ్ కంపెనీ 110 సంవత్సరాల జపాన్ సేవలు అందిస్తుందన్నారు.

Also Read: అందుకే హరీష్ రావును కలిశా: రాజాసింగ్

అతి తక్కువ సహజ వనరులు ఉన్న జపాన్ అద్భుతమైన దేశంగా ఎదిగిందని కెటిఆర్ ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని జపాన్ నిలబడుతోందని, దేశంలోని ప్రతి ఇంటిలో ఏదో ఒక జపాన్ ఉత్పిత్తి ఉంటుందని కొనియాడారు. రూ.575 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1600 మంది ఉద్యోగాలు వస్తాయన్నారు. అంతర్జాతీయ పేరు కలిగిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నారని, పారిశ్రామికవాడగా చందన్‌వెళ్లి ఎదుగుతోందని మెచ్చుకున్నారు. చందన్‌వెల్లిలో జపాన్ కంపెనీల కోసం ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. తయారీ రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శంగా నిలిచిందని కెటిఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌సి మహేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎ కాలేయాదయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News