Saturday, November 23, 2024

బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని మంత్రి సత్యవతికి వినతి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి కోరారు. ఈ సందర్భంగా హైద రాబాద్ బంజారా హిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి కార్యాలయంలో నల్ల భారతి నేతృత్వంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో స న్మానించి మొక్కను బహూకరించారు.

అనంతరం అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ నాన్‌లోకల్‌గా ఉన్న అంగన్‌వాడీ టీచర్స్‌కు బదిలీలు చేపట్టాలని, ఖాళీలు ఉన్న చోట అంగన్‌వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంటు బెనిఫిట్స్, పింఛన్ సౌకర్యం కల్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యాకార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించడం కోసం గర్బిణీ, బాలింతలకు ఇంటికి రేషన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రతీ నెల 5 లోపు వేతనాలు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూరగాయాలు, పోపు సామాన్లు, గ్యాస్ బిల్లులు పెంచాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వినతిపత్రం అందచేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, ఉపాధ్యక్షురాలు రమాదేవి, కోశాధికారి వేదవతి, రాష్ట్ర నాయకులు శిరీష, సురేఖ, ఎల్లమ్మ, రేణు, నాయకులు శారద, అపర్ణ, మంగ, సునీత, ఆరిఫా, పుష్పలీల, భవాని, లావణ్య, సరిత, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News