Saturday, November 16, 2024

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ : మహిళలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వార అందించే వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూ చించారు. పట్టణంలోని భాగ్యనగర్‌లో గల న్యాక్ కేంద్రంలో శుక్రవారం మూడు నెలల శిక్షణ పూర్థి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాక్ ద్వార పదహారు రకాల వృత్తి నైపుణ్యాల శిక్షణలు అందిస్తున్నారని తెలిపారు. కుట్టు మిషన్ వంటి శిక్షణలే కాకుండా సాంకేతికంగా సైతం రాణించాలన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి ఇటువంటి శిక్షణలు ఎంతగానో దోహాదం చేస్తాయన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఆసకిత కలిగిన మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్ ఆశోక్ స్వామి, విష్ణు, న్యాక్ నిర్వహకులు మేరి దావోత్ రమేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News