సిరిసిల్ల : తెలంగాణలో ప్రజలకు బిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇంటింటికి వివరించి మరోసారి బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత బిఆర్‌ఎస్ కార్యకర్తలపై మాత్రమే ఉందని టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ అన్నా రు. శుక్రవారం సిరిసిల్లలోని 23వ,36వ వార్డులకు చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బూత్ కమిటీని నియమించారు.
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు, టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రచార అస్త్రాలుగా ప్రతి కార్యకర్త గర్వంగా ప్రజలను ఓట్లు అడగవచ్చన్నారు. సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్‌కు 60 లక్షల మంది సభ్యులున్నారన్నారు. కెసిఆర్‌ను మరోసారి సిఎంగా చేయడం కోసం సిరిసిల్లలో కెటిఆర్‌ను మరోసారి గెలిపించడం కోసం కార్యకర్తలు గులాబీ సైన్యంగా మారి అన్నిరకాల ప్రచార వ్యూహలతో ముందుకు సాగాలన్నారు.
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేసి రానున్న శాసన సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టిఎస్‌పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి,మహిళ అధ్యక్షురాలు బత్తుల వనజ, మంచె శ్రీనివాస్,కల్లూరి రాజు, బైరి చంద్రశేఖర్,రాపెలి లక్ష్మినారాయణ, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్,దాసరి రమేష్ మున్సిపల్ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.