Friday, January 3, 2025

ఆరోగ్య ఉప కేంద్రాల తనిఖీ

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర మండలంలోని మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో క్షయ నివారణ మందులు వాడుతున్న వారి రిజిస్టర్ల తనిఖీ,అలానే ఎన్‌సిడి కార్నర్ లో పీహెచ్సీలో షుగర్,బీపీ మందులు వాడుతున్న రిజిస్టర్లు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో జరిగిన సమావేశంలో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ, గ్రామాల్లో క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి, పరీక్షల నిమిత్తం పీహెచ్సీకి రిఫర్ చేయాలని, దగ్గరుండి మందులు మింగించాలని, 30 సంవత్సరాలు దాటిన వారందరికీ ఎన్‌సిడి కార్యక్రమంలో భాగంగా బిపి, షుగర్ మరియు నోటి, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అనుమాన స్పదంగా ఉన్న కేసులను మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా మధిరకు రిఫర్ చేయాలని ఆదేశించారు.

20వ తారీకు జరగబోయే నేషనల్ డి వార్మింగ్ డే, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎండిఏ ప్రోగ్రామ్స్ పై అవగాహన కల్పించారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు తో పాటు, మాటూరుపేట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, ఎన్‌సిడి నోడల్ పర్సన్ వి.భాస్కర్ రావు, సిహెచ్‌ఓ సుభాషిని, హెచ్ ఈ ఓ శరత్ బాబు,హెచ్ ఎస్ మరియా రాణి,ఎం ఎల్‌హెచ్‌పి ప్రదీప్, ఎస్‌టిఎస్ సందీప్, డీఈవో కిరణ్, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, స్టాఫ్ నర్స్ మార్తమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ పు తిలి బాయ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News