Monday, December 23, 2024

మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆహ్వానించాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ప్రతి నెల చివరి రోజులన జరిగే పౌరహక్కుల దినోత్సవం సమావేశంకు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధ్ది సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

దళితవాడలో ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం జరిగే విదంగా అధికారులు చూడాలని తెలిపారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి వెంకన్న, మానిటరింగ్ కమిటీ సభ్యులు మల్లయ్య, పుట్ట మల్లికార్జున్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News