Monday, December 23, 2024

డిఎస్‌ఈ ఆఫీస్‌లో బోనాల ఉత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తరాలు మారుతున్న బోనాల ఉత్సవాల వైభవం నేటికి తరగడం లేదు. నిజాం ఏలుబడి నుంచి బోనాల శ్రీ అమ్మవారి వేడుకలు ఏటా దేదిప్యమానంగా వెలుగొందుతూ.. ఆధ్యాత్మిక శోభ వెల్లిరిస్తోందడానికి రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టరేట్‌లో కొలువుదీరిన శ్రీ అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలే నిదర్శనం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు పొటెత్తడంతో పవిత్ర ఆవరణ భక్తి తన్మయత్వం పులకరించిపోయింది. తెలంగాణ భక్తి సంస్కృతి, సంప్రదాయలకు ప్రతిబింబించేలా ఉత్సవాలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.

వేద మంత్రాల మద్య శక్తిమంతురాలైన మాతేశ్వరికి పూజాదికాలు, అభిషేకం, కుంకుమార్చన, హారతి వంటి కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ బోనాలు జేజేలు, శ్రీ అమ్మవారికి జై, జై తెలంగాణ, తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బోనాలకు జై అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి. కళాకారుల విచిత్ర వేషధారణ ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణ… డప్పువాద్యాల హోరు,భక్తి నినాదాలు, నృత్యాలతో సందడి చేశారు. మహిళలు బోనాలు తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు సమర్పించారు. పలువురు అమ్మవారి ఆశీస్సుల కోసం తరించారు.

పోతరాజుల వీరంగం, భక్తినినాదాలు, డప్పువాయిద్యాల హోరులో బోనాల ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వాకట కరుణ, తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ దేవాసేనా, రాష్ట్ర శాసనమండలి సభ్యులు ఎవీఎన్ రెడ్డి, రఘోమత్తం రెడ్డి, అదనపు డైరెక్టర్ లింగయ్య, ఎస్‌పీడీ రమేశ్, జేడీ మదన్‌మోహన్,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం ప్రతినిధులు ఎం.సత్యనారాయణ గౌడ్, కాస్తురి వెంకటేశ్వర్ల, జి. శ్రీనివాస్‌గౌడ్, నగర టీఎన్జీవో నాయకులు కె. శ్రీకాంత్, డీఎస్సీ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు ఫణిరాజ్, కార్యదర్శి దుర్గారాణి, నాయకులు ఎ.సత్యనారాయణ మూర్తి, కృష్ణమోహన్ రెడ్డి, ప్రశాంతికుమారి, వెంకటేశ్, జ్యోతి,మనీష్, పూర్ణచంద్రరావు,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద భక్తులు, ఉద్యోగులు కలిసి సామూహికంగా భోజనాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News