యాదాద్రి భువనగిరి: బాలింతలు, గర్భిణులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం బండసోమారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో ఆమె పాల్గొని బాలింతలు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలింతలు, గర్భిణులు ఆరోగ్యం కోసమే శుక్రవారం సభలు నిర్వహిస్తున్నామని, తల్లి బిడ్డల సంక్షేమానికి తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని, బాలింతలు గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, ఆకు కూరలు, పప్పు దినుసులు, పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని, మీరు మంచిగా, ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుందని అన్నారు.
సాధారణ ప్రసవాల వలన పూర్తి ఆరోగ్యంతో ఉండవచ్చునని, తద్వారా తాను ఆరోగ్యంగా ఉండటమే కా కుండా పిల్లలను మంచిగా సంరక్షించుకోవచ్చునని, సాధారణ డెలివరీలకు ప్రయత్నం చేయాలని, తద్వారా పుట్టిన శిశువుకు ముర్రుపాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, మంచి ఆ రోగ్య వ్యవస్థ ఏ ర్పడుతుందని, అలాగే తల్లులు కూడా త్వరలోనే పనులు చేసుకోవచ్చని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను తెలుసుకొని పాటించాలని, వ్యాయామాలు, నడక పాటించాలని, గర్భిణీ మొదలుకొని బిడ్డ కు ఆరు నెలలు వచ్చేవరకు ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వేసుకోవ డం వలన బిడ్డకు రక్తహీనత రాకుండాకాపాడబడుతుందని, ఆల్బెండజోళ్ళు మాత్రలు వాడడం వలన నులిపురుగుల నివారణ జరిగి పోషకాహార లోపం నివారించబడుతుందని అన్నారు. మహిళల ఆ రోగ్యం కోసం ఏర్పాటు చేయబడిన ఆరోగ్య మహిళా కేంద్రాలలో మ హిళలందరూ ఆరోగ్య పరిక్షలుచేయించుకోవాలని, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
గర్భిణులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం, కెసిఆర్ కిట్లను వినియోగించుకోవాలని తెలిపారు. మన ఆరోగ్యానికి ఆహారంతో పాటు పరిసరాల శుభ్రత, చేతుల శుభ్రత ముఖ్యమైనవని, ఏఎన్సి రిజిస్ట్రేషన్ వలన ప్రతి గర్భిణీ తన గర్భవతి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. మగ బిడ్డ అయినా ఆడ బిడ్డ అయినా ఒకటే అని, ఇద్దరు బిడ్డలు చాలని, పిల్లల అభివృద్ధి ఎంతో ముఖ్యమైనదని తెలియజేస్తూ పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇవ్వవద్దని, అలాగే బిడ్డకు ఇష్టమైన ఆహారమని చెప్పి చిరుతిళ్లు తినిపించకూడదని, అవి అనారోగ్యానికి దారితీస్తాయని, ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటారని, ఆహారంలో అధిక మోతాదులో ఆకుకూర లు పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.
మహిళల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయబడిన ఆరోగ్య మహిళా కేంద్రాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. శుక్రవారం సభలో గ్రామ సర్పంచ్ పద్మ, వార్డ్ సభ్యులు, సిడిపిఓ స్వ రాజ్యం, సూపర్వైజర్లు వైదేహి, ఊర్మిళ, అంగన్వాడీ టీచర్, బాలింతలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.