Friday, September 20, 2024

విద్యకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

రంగారెడ్డి: మన ఊరు మన బడి కింద ప్రభుత్వ బడులను దశల వారీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఎంపిపి అధ్యక్షతన జరిగిన విద్యాసదస్సులో ఆయనతోపాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.వి రమణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరుమన బడి కింద 58 పాఠశాలలకు 23 పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరుమన బడి కింద రూ.7200 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్‌వి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యతోనే దేశ మనుగడ సాధ్యమని అన్నారు. శాస్త్ర సాంకేతిక వైపు విద్యార్థులను మళ్ళించాలని సూచించారు.

2022-23 సంవత్సరంలో 10లో జిపిఏ సాధించిన విద్యార్థులను ఎమ్మెలే సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలను బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కావాల్సిన వారు తమకు లిస్టు ఇవ్వాలని అక్కడ స్కూల్‌ల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ మహిపాల్ , వైఎస్ ఎంపిపి ప్రతాప్‌రెడ్డి, ఎంపిడిఓ , జయరాం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News