Friday, December 20, 2024

క్రైస్తవ మహిళలకు కెసిఆర్ కానుక

- Advertisement -
- Advertisement -
దరఖాస్తులను ఆహ్వానించిన కార్పొరేషన్

హైదరాబాద్ : రాష్ట్రంలోని క్రైస్తవ మహిళల కోసం ప్రవేశపెట్టిన కెసిఆర్ కానుక పథకం కింద అర్హులైన క్రైస్తవ మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పథకం కింద నిరుద్యోగ క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తామని క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లి వెల్లడించారు.

అర్హులైన తెలంగాణ క్రైస్తవ మహిళలు ఈ నెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వాటిని ఆయా జిల్లా అధికారి కార్యాలయాల్లోనే అందజేయాలన్నారు. అభ్యర్థులు 21 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, గ్రామీణ ప్రాంత అభ్యర్థుల వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత అభ్యర్థుల వార్శికాదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అంతేకాక తెల్ల రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగి ఉండాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News