- Advertisement -
కరీంనగర్: జిల్లాలో ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ డెంగ్యూ కేసు కూడా నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఆశా, అంగన్‌వాడీలు ప్రతి వార్డులో మంగళ, శుక్రవారాల్లో డైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఫాగింగ్ చేయాలని సూచించారు.
ఒక్క కేసు నమోదైన ఆ ప్రాంతం మొత్తం పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, మెడికల్ సూరింటెండెంట్ కృష్ణభాస్కర్, డీపీవో వీరబుచ్చయ్య, డీడబ్లుఓ సంధ్యారాణి, సబితా, డాక్టర్లు, సీడీపీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -