- Advertisement -
ముంబై : మహారాష్ట్రలో ఆర్థిక మంత్రిగా అజిత్ పవార్ కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్‌సిపిలో తిరుగుబాటు క్రమంలో ఆయన మహారాష్ట్ర కేబినెట్‌లో చేరారు. ఆయనతో పాటు ఎనమండుగురికి మంత్రిత్వశాఖలను ప్రకటించారు. ఇందులో భాగంగా కీలకమైన ఆర్థిక శాఖను అజిత్ పవార్‌కు కేటాయించారు. ఇప్పటికే ఆయన ఉపముఖ్యమంత్రి కూడా అయ్యారు. చాలారోజులుగా మంత్రిత్వశాఖలపై సస్పెన్స్ ఉంటూ వచ్చింది. అజిత్‌కు ఆర్థికంతో పాటు ప్రణాళికల శాఖను , మరో కీలక నేత ఛగన్ భుజ్‌బల్‌కు ముఖ్యమైన ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల పరిరక్షణ శాఖలు కేటాయించారు. మరో నేత ధర్మారావుబాబాకు ఔషధ నియంత్రణ నిర్వహణ (ఎఫ్‌డిఎ)ను అప్పగించారు.
- Advertisement -