- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో నూతన రీతిలో ఔషధ సంబంధిత బిల్లు పరిశీలనకు రానుంది. భారతదేశంలో ఉత్పత్తి అయిన దగ్గుమందు సిరప్‌లు కొన్ని దేశాలలో వాడకపు దశల్లో వికటించాయి. ఇది అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీసింది. గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో భారతీయ దగ్గు మందు కారణంగా 89 మంది పిల్లలు మృతి చెందారు. దీనిని పరిశీలించి కేంద్రం ఔషధ నియంత్రణపై దృష్టి పెట్టింది. నాణ్యత, భద్రత, సమర్థత, పనితీరు ,
చికిత్సపరంగా పరీక్షలు తరువాతనే ఇకపై కొత్త మందులను అనుమతించేందుకు వీలుగా సరైన విధివిధానాలతో ఈ బిల్లును రూపొందించనున్నారు. అత్యున్నత స్థాయిలో నియంత్రణ ప్రక్రియ పారదర్శక వ్యవస్థ అయ్యేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు గురువారం ఓ పార్లమెంటరీ వ్యవహారాల ప్రకటనలో తెలిపారు. బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో చర్చించేందుకు వీలుంది.
- Advertisement -