Friday, November 15, 2024

స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన కలెక్టర్, కమిషనర్

- Advertisement -
- Advertisement -

సుబేదారి: పుస్తకాలకు ఆర్‌ఎఫ్‌ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్) ట్యాగులను అమర్చాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాతో కలిసి కలెక్టర్ నగరంలో స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కొనసాగుతున్న భద్రకాళి బండ్, పోతన ట్రాన్స్‌ఫర్ స్టేషన్, రీజనల్ లైబ్రరీ, అజారా ఆసుపత్రి ప్రాంతంలో నిర్మిస్తున్న కల్వర్టు, వడ్డెపల్లి బంద్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో కొన సాగుతున్న పలు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పురోగతి గురించి సమీక్షిస్తామని, ఇందు కోసం క్షేత్రస్థాయిలో వాస్తవ పరి స్థితులను తెలుసుకోడానికి పర్యటించడం జరుగుతుందన్నారు. భద్రకాళి బంద్‌పై కొనసాగుతున్న పనులను సెప్టెంబర్ మొదటి వారం లోగా పూర్తి చేయాలని, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ వైపు ఉన్న గోడను తొలగించి పోత ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వైపు ఉన్న కాంక్రీట్ పనులను ఒక నెల లోపు పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లాండ్రో మార్ట్ ప్రాంతంలో ల్యాండ్ స్కేప్ పనులను పూర్తి చేయాలని సీహెచ్‌ఓను ఆదేశించారు. రంగంపేటలోని రీజనల్ లైబ్రరీలో ఈ. లైబ్రరీ సౌకర్యాన్ని అం దుబాటులోకి తీసుకవచ్చి వివిధ అంశాలకు చెందిన 4000 నుంచి 5000 పుస్తకాలను చదువుకునేలా అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. వడ్డెపల్లి బండ్ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ అక్కడ రిటైనింగ్ వాల్‌ను నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్శనలో బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీహెచ్‌ఓ శ్రీనివాసరావు, డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ఈఈలు రాజయ్య, సంజయ్‌కుమార్, డీఈలు రవికుమార్, సంతోష్‌బాబు, స్మార్ట్ సిటీ పీఎంపీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News