Monday, January 20, 2025

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -

కౌటాల: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలంలోని నాగేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసిఆర్ కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

కొత్తగా ఏర్పాడిన జీపిలకు నూతన భవనాలు నిర్మిస్తామని తెలిపారు. గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే కౌటాల మండలంలోని బారేపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి ఎంపిపి బసర్కార్ విశ్వనాథ్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి డోంగ్రే అనుష, సర్పంచ్‌లు నిహారిక, జాడే కుశబ్‌రావు, కోజ్జల మౌని ష్, వసంత్‌రావు, రవిందర్‌గౌడ్, మౌనిక, సంధ్య, మదుకర్, శ్రీనివాస్, సంతోష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News