Monday, December 23, 2024

మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీల్లో ప్రభుత్వ విప్ పర్యటన

- Advertisement -
- Advertisement -

రామకృష్ణాపూర్: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శుక్రవారం నియోజకవర్గంలోని మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలలో పర్యటించారు. చేయి చొప్పితో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును మంద్మర్రి పట్టణంలోని తన స్వగృహంలో కలిసి పరామర్శించారు.

మందమర్రి పట్టణంలో నూతనంగా నిర్మించిన కబ్రస్థాన్‌ను ప్రారంభించారు. అనంతరం రామకృష్ణాపూర్ పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను, 22 కోట్లతో పట్టణంలో నిర్మించనున్న పలు రోడ్లను ఆయన పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న 11వ వార్డు కౌన్సిలర్‌ను పరామర్శించారు.

ఆయ న వెంట టీబీజీకేఎస్ అద్యక్షుడు కెంగర్ల మల్లయ్య, మందమర్రి నాయకులు జె రవిందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, రామకృష్ణాపూర్ బీఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంచార్జి గాండ్ల సమ్మయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం క ళ, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, యువ నాయకులు గంగారపు సత్యపాల్, ఆశనవేన సత్యనారాయణలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News