Monday, December 23, 2024

ఎపిలో నూతన సమాధాన్ కేంద్రాన్ని ప్రారంభించిన గోద్రెజ్ ఆగ్రోవెట్

- Advertisement -
- Advertisement -

విజయవాడ: గోద్రెజ్ ఆగ్రోవెట్ యొక్క ఆయిల్ పామ్ వ్యాపారం ఆంధ్రప్రదేశ్‌లోని సిహెచ్.పోతేపల్లిలో కొత్త సమాధాన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుర్జిస్ గోద్రెజ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది కంపెనీకి 6వ సమాధాన్ కేంద్రం, గత రెండు దశాబ్దాలుగా వ్యాపార కార్యకలాపాలకు మరియు ఉపాధి అవకాశాలకు ముఖ్యమైన మూలస్తంభంగా ఉన్న సిహెచ్.పోతేపల్లి వద్ద కంపెనీ యొక్క మొదటి మిల్లులో ఉంది.

ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞానం, సాధనాలు, సేవలు, పరిష్కారాల యొక్క సమగ్ర ప్యాకేజీని అందించే వన్ స్టాప్ సొల్యూషన్ సెంటర్ సమాధాన్. పామాయిల్ పరిశ్రమలో కీలకమైన తోడ్పాటుదారునిగా ఉండటమే ఈ కేంద్రాల లక్ష్యం, తాజా వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచడం తో పాటుగా రైతులు తమ దిగుబడికి మెరుగ్గా రాబడిని పొందటంలో ఆయిల్ పామ్ రైతులకు సహాయం చేస్తుంది. సమాధాన్ కేంద్రాల నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా, ఆయిల్ పామ్ రైతులకు విజ్ఞానం, సమకాలీన సాంకేతికతల ను పొందే అవకాశం అందించడంపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది, తద్వారా ఆయిల్ పామ్ సాగులోకి ప్రవేశించడం, వారి ఆదాయంలో స్థిరమైన వృద్ధిని సాధించడం గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.

కొత్త సమాధాన్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బుర్జిస్ గోద్రెజ్ మాట్లాడుతూ, “గోద్రెజ్ ఆగ్రోవెట్‌ వద్ద, సరైన సమాచారం, సులభమైన పరిష్కారాలను అందించడం ద్వారా భారతీయ రైతులను ఉద్ధరించడమే మా ప్రయత్నం. ఆయిల్ పామ్ రైతులకు అవసరమైన కీలకమైన మద్దతును గుర్తించి, బాల్య దశ నుండి మెచ్యూరిటీ దశల వరకు, మా సమాధాన్ కేంద్రాలు పరిశ్రమ విస్తరణకు, రైతుల శ్రేయస్సు కోసం పరిష్కారాలను అందించాలని భావిస్తున్నాయి. మన రైతులకు సహకారంగా పనిచేసి, అధిక దిగుబడులు సాధించేలా వారిని శక్తివంతం చేసి, వారి జీవనోపాధికి ఉజ్వల భవిష్యత్తును అందించే ఈ కేంద్రానికి ఈరోజు రావడం గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు.

గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్, ఆయిల్ పామ్ బిజినెస్, సీఈఓ సౌగత నియోగి, సమాధాన్ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, వారు మాట్లాడుతూ “మా కొత్త సమాధాన్ సెంటర్‌ను చేర్చడం భారతదేశంలో ఆయిల్ పామ్ పరిశ్రమ యొక్క దీర్ఘకాలిక, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో మా అచంచలమైన అంకితభావానికి మరో ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఆయిల్ పామ్ రైతులకు ఏకీకృత పరిష్కారాన్ని అందించడం ద్వారా వారి పట్ల తమ లోతైన నిబద్ధతను బలపరుస్తూ, డెవలప్‌మెంటల్ ఫైనాన్స్, ప్రభుత్వ రాయితీలు/స్కీమ్‌లు, అనేక ఇతర ప్రయోజనాలను పొందడంలో ఈ కేంద్రాలు రైతులకు సహాయపడతాయి” అని అన్నారు.

ప్రతి సమాధాన్ కేంద్రం 2,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ నాటడానికి మద్దతునిస్తుంది, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, నిపుణుల సలహాలను అందించటం ద్వారా రైతులు పరిపక్వ తోటలలో స్థిరమైన ఉత్పాదకతను సాధించడంలో సహాయం చేస్తుంది. ఇప్పటి వరకు 6 సమాధాన్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని రైతుల జీవితాలను స్పృశించిన గోద్రెజ్ ఆగ్రోవెట్ 2027 నాటికి 50 సమాధాన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News