- బివిఆర్‌ఐటి కళశాల విద్యార్థులకు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించిన మెదక్ కలెక్టర్ రాజర్షి షా
నర్సాపూర్: ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అని, మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం నర్సాపూర్ బివిఆర్‌ఐటి కళాశాలలో ఓటు ప్రముఖ్యత పై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈసిఐ ఆదేశాల ప్రకారం 18 సంవత్సరాలు నిండి యువతి యువకులు తప్పని సరిగా, ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25 తేదీన ఓటర్ దినోత్సవము జరుపుకోవడం జరుగుతుందన్నారు. అందరు ఓటర్ హెల్ప్ లైన్ అప్ ను డౌన్లోడ్ చేసుకొని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు, ఓటును నమోదు చేసుకోవాలన, ఈసిఐ వెబ్ ద్వారా ఓటును నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఒక నెలలో ఈపిఐసి కార్డు వస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివి ప్యాట్ ప్రదర్శన, రహస్య ఓటింగ్ సరళి ని, విద్యార్థులకు డెమో చేస్తూ అవగాహన కల్పించారు. భారత ఎన్నికల సంఘం సంచార ప్రసార వాహనము తో, అన్ని నియోజక వర్గాలలో ప్రసారం చేయాలని, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో నర్సాపూర్ ఆర్‌డిఓ శ్రీనివాసులు, స్వీప్ నోడల్ రాజిరెడ్డి, ఏఈఆర్‌ఓ లు, బివిఆర్‌ఐటి కళశాల ప్రిన్సిపాల్, ఎన్నికల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.