Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి… సంక్షేమ పథకాలు సాధ్యం

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్‌లో చేరిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు
  • ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

దౌల్తాబాద్ (రాయపోల్): బిఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు సాద్యమని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో బిఆర్‌ఎస్‌లోకి వలసల పరంపర కొనసాగుతుంది. శనివారం రాయపోల్ మండలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ నాయులు ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో 20 మంది చేరారు. ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజక వర్గ ప్రజలకు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ పథకాలు గురించి వాస్తవాలు అర్ధమయ్యాయని అన్నారు. బిఆర్‌ఎస్ లో చేరిన కాంగ్రెస్, బిజెపి నాయకులు బోనగిరిస్వామి, పిడిచేటి శ్రీనివాస్, బోనగిరి బాను, ఎర్రోళ్ల ప్రశాంత్, రాజు, కాంగ్రెస్ నాయకులు స్వామి, రాజు, రవి, రాజయ్య, ప్రశాంత్, నవీన్, మహేశ్,శ్రీకాంత్, మల్లయ్య, మహి, పర్శరాములు, మల్లయ్య ,ద యాకర్‌లకు ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి బిఆర్‌ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మండల పార్టీ అద్యక్షుడు వెంకటేశ్వరశర్మ, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి, కల్లూరి శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి బాలనర్సయ్య, బిఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News