Friday, December 20, 2024

శంషాబాద్ విమానాశ్రయానికి హజ్ యాత్రికుల తొలి విమానం

- Advertisement -
- Advertisement -
స్వాగతం పలికిన మహమూద్ అలీ, సలీం

హైదరాబాద్ : హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ తీర్థయాత్రకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు తిరిగి రావడం ప్రారంభించారు. శనివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి హజ్ యాత్రికుల తొలి విమానం చేరుకుంది. హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ సలీం, హజ్ కమిటి సభ్యులు షేక్ హమీద్ పటేల్ (కొండాపూర్), సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ (కరీం నగర్), సయ్యద్ నిజాముద్దీన్ (నార్సింగి), ఎండి జాఫర్ ఖాన్ (గజ్వేల్) ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎండి ఖాజా ముజీబుద్దీన్, హజ్ కమిటీ ఎఇఓ ఇర్ఫాన్ షరీఫ్, హజ్ కమిటీ అధికారిక సిబ్బంది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన టెర్మినల్ వద్ద యాత్రికులకు స్వాగతం పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News