గోదావరిఖని: సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేద జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్‌లో శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటికి తిరుగుతూ సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు ప్రజల కష్టాలు పట్టించుకోలేదని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతమంతా బీడు భూములయ్యాయని, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. పేదల కష్టాలు తెలిసిన సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు.
దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నానాటికి బిఆర్‌ఎస్‌కు మద్ధతు పెరుగుతుందని అన్నారు. హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్‌ను గెలిపించడానికి ప్రజలు సమాయత్తం అయ్యారని అన్నారు. సిఎం కెసిఆర్ సహకారంతోరామగుండం నియోజక వర్గంలో అనేక అభివఋద్ధి కార్యక్రమాలను పూర్తి చేశానని అన్నారు.
ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి పరిష్కారానికి కఋషి చేస్తామని హామీ ఇచచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితా సరోజిని, నాయకులు మెతుకు దేవరాజ్, అచ్చ వేణు, పిల్లి రమేష్, మేడి సదానందం, చెలుకలపల్లి శ్రీనివాస్, కలువల సంజీవ్, ముద్దసాని సంధ్యారెడ్డి, దాసరి శ్రీనివాస్, అక్షర మల్లేష్, అల్లం ఐలయ్య యాదవ్, హఫీజ్, కోడి రామక్రిష్ణ, చిట్టవేన వేణు, మేకల అబ్బాస్, ఇరుగురాల్ల శ్రావణ్, చింటూ, పిడుగు కుమార్ తదితరులున్నారు.