Saturday, December 21, 2024

శ్రీశైలం రిజర్వాయర్‌లో 120టిఎంసీలు దోపిడి

- Advertisement -
- Advertisement -
నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

హైదరాబాద్ : శ్రీశైలం రిజర్వాయర్ నుండి 120టిఎంసీల నీటిని దొంగిలించారని సాగునీటి సాధన సమితి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో నీటి చౌర్యాన్ని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఆ జిల్లా ఎస్పీకి రఘువీరారెడ్డికి ఫిర్యాదు చేసింది.కృష్ణా, తుంగభద్ర నదులు ద్వారా గత నీటి సంవత్సరం 2022 జూన్ ఒకటి నుండి ఈ ఏడాది మే 31 వరకు 2017టిఎంసీల శ్రీశైలం రిజర్వాయర్ కు చేరింది.

నీటి కేటాయింపులకు అదనంగా శ్రీశైలం రిజర్వాయర్ కు నీరు చేరిన సందర్భంలో కనీస నీటిమట్టం 854 అడుగుల పైన 60 టిఎంసీల క్యారీ ఓవర్ రిజర్వుగా నీటిని నిలువ ఉంచాలని చట్టం ఉంది. రాబోయే నీటి సంవత్సరంలో వర్షాలు ఆలస్యమైన, నీరు తక్కువగా వచ్చిన త్రాగు నీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయ పనులకు అవాంతరాలు కలుగకుండా ఉండటానికి ఈ చట్టం చేసారు.ఈ చట్టం ప్రకారం 2023 మే 31 నాటికి శ్రీశైలం రిజర్వాయర్లో 873 అడుగులు స్థాయిలో సుమారు 150 టిఎంసిల నీరు నిలువ ఉండాలి. కాని మే 31 నాటికి రిజర్వాయర్ 810 అడుగుల స్థాయిలో 34 టిఎంసీల నీరు ఉంది. రిజర్వాయర్ లో ఈ స్థాయిలో నీరు ఉంటే రాయలసీమ నీటిని పొందడానికి అవకాశం ఉండదు.

చట్ట ప్రకారం ఉండాల్సిన నీటి నుండి సుమారు 120 టిఎంసీల నీరు దొంగతనం జరిగింది. ఈ నీటి దొంగ తనం జరగకుండా కాపాడటానికి సర్వోన్నత అధికారుల ఆధ్వర్యంలో సాగునీటి శాఖ పర్యవేక్షణ చేస్తున్నది. అయినప్పటికీ ఈ నీటి దొంగతనం జరిగింది. ఈ నీటిని ఎవరు దొంగతనం చేసారు, ఎలా చేసారు అని తేల్చడంలో సాగునీటి శాఖ సర్వోన్నత అధికారులు అయోమయంలో పడ్డారు. కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ఆ దొంగలను కనిపెట్టి, నీటి దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి, జీవన హక్కైన త్రాగు నీరు రాయలసీమ ప్రజానీకం పొందేలాగా చేయాలని సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి పోలీసు శాఖకు విజ్ణప్తి చేశారు. అదేవిధంగానే భవిష్యత్తులో నీటి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాడానికి జలవనరుల శాఖ సర్వోన్నత అధికారులకు తగిన సూచనలు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డికి సాగునీటి సాధన సమితి నేతలు ఫిర్యాదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News