Saturday, November 23, 2024

ఎటిఎం రాబరీ కేసులో నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎటిఎం మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దోపిడీ చేసిన నలుగురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, దోమలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3,25,000, కారు, పెప్పర్ స్ప్రే, బైక్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పాత కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రానికి చెందిన తనిఫ్ అలియాస్ తన్సీ నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఉంటూ మొబైల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

మహ్మద్ షాహద్ టివి, తనీష్ బారిక్కల్, అబ్దుల్ ముహీస్ కలిసి రాబరీ చేశారు. డిసెంబర్ 14,2022న హిమాయత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఎటిఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుందుకు సిబ్బంది వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితులు టెక్నీషియన్‌పై పెప్పర్ స్ప్రేకొట్టి రూ.7లక్షలు దోచుకుని పారిపోయారు. బాధితులు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి నిందితులను కేరళకు చెందిన వారిగా గుర్తించారు. వారిని కేరళలోని పలు ప్రాంతాల్లో అరెస్టు చేసి నగరానికి తీసుకుని వచ్చారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రఘనాథ్, ఎస్సైలు నవీన్‌కుమార్, శ్రీకాంత్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News