Friday, December 20, 2024

విద్యుదాఘాతంతో జూనియర్ లైన్‌మెన్ మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: ప్రమాదవశాత్తు విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్‌కు గురై జూనియర్ లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన భువనగిరి పట్టణ సబ్ స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భువనగిరి సబ్ స్టేషన్‌లో జూనియర్ లైన్ మెన్‌గా సుంకరి రామకృష్ణ గత కొంత కాలంగా విధులు నిర్వహిస్తున్నాడు.

శనివారం విధులలో భాగంగా ఫీడర్ ఆఫ్ చేసి వస్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. రామకృష్ణ కు భార్య, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News