Saturday, January 4, 2025

రుణామాఫీ చేయాలని 18న నిరసన : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గత ఎన్నికల్లో లక్ష రూపాయల వరకు రైతుల అన్ని రుణాలను మాఫీ చేస్తామని బిఆర్‌ఎస్ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా రాష్ట్ర బాధ్యుడు- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2018లో బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే లక్ష రూపాయల లోపు ఉన్న రైతు రుణాలన్నిటిని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 18న నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News