హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రజలు నమ్మడం లేదని దర్శకుడు రాంగోపాల్ వర్మ విమర్శించారు. ఆదివారం పవన్ మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై పవన్ నిరాధార ఆరోపణలు చేశారని, ఏదైనా ఆలోచనతో చేయడని, స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడని దుయ్యబట్టారు. సినిమాల్లో నటించే హీరో బయట హీరో కాలేడన్నారు. పవన్‌కు కూడా తనపైనే తనకు నమ్మకం లేదని, ఈ సారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని పవన్ భావిస్తున్నారన్నారు. విప్లవానికి, జనసేన పార్టీకి ఏం సంబంధం? అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. రాజకీయాలను పవన్ సినిమాలా చూస్తున్నారని, పవన్ తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారని, నిఘా వర్గాలు తమ పని చేసుకోకుండా పవన్‌కు నివేదికలు ఇస్తున్నాయా? అని రాంగోపాల్ వర్మ అడిగారు. ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనేదే పవన్ ఆలోచన అని, సినిమాల్లో సీన్స్ రియాక్షన్ పవన్ బయట చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ఇష్టప్రకారమే వాలంటీర్లకు తమ డేటా ఇచ్చారని, ప్రజలను భయపెట్టి వాలంటీర్ల డేటా తీసుకోలేదన్నారు.
Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్