Saturday, December 21, 2024

మీటర్లను తొలగించి పన్నులను రద్దు చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఉచిత విద్యుత్ మాట పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు కూడా మీటర్లు బిగించి వేలకు వేల బిల్లులు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని హరిజన వాడలో బాధితుల నివాస గృహాలను పరిశీలించి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఆదాయపు పన్నులు వసూలు చేయడం విడ్డూరంగా ఉందని, వారు సంపాదించుకుని ఇల్లు కట్టుకోలేదని, ప్రభుత్వం వారికి ఉచితంగా ఇంటిని నిర్మించి ఇవ్వడం జరిగిందని వివరించారు.

ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్తును కొనుగోలు చేసి వాటి భారాన్ని పేదలపై వేయడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 9 సంవత్సరాల కాలంలో ఒక్క యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని, విద్యుత్ కేంద్రాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన యాదాద్రి ధర్మల్ పవర్ కేంద్రం నుంచి ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. విద్యుత్ వినియోగం కన్నా అదనపు చార్జీలు, జరిమానాలు పేదలకు భారంగా మారాయని ఆయన అన్నారు. వెంటనే విద్యుత్ బిల్లులకు అదనపు పన్ను రద్దు చేయకపోతే దళిత పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, మండల పార్టీ అధ్యక్షుడు కోటయ్య, తాడూరు మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజిపేట పాండు, సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, కౌన్సిలర్ నిజామోద్దీన్, నాయకులు శ్రీకాంత్ రావు, సత్యం, అహ్మద్, చంటి, బాలరాజు, భీముడు, ఎల్లయ్య, పరుశరాములు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News