వనపర్తి : వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల గురుకుల పాఠశాల విద్యార్థి శనివారం రాత్రి పది గంటల సమయంలో పాము కాటుకు గురయ్యాడు. ప్రిన్సిపల్‌కు సమాచారం అందించిన నిర్లక్షంతో రాత్రంతా హాస్టల్ రూంలో పడుకోబెట్టగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో విద్యార్థి పరిస్థితి విషమించడంతో తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలిపిన తర్వాత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. రాత్రి జరిగిన సంఘటన ప్రిన్సిపల్ దయాకర్ వెంటనే స్పందించకుండా పాము కాటుకు గురైన విద్యార్థి పట్ల నిర్లక్షం వహించడమే కాకుండా ఆసుపత్రికి కూడా ఆలస్యంగా తరలించి తల్లిదండ్రులకు ఉయదం 8 గంటల సమయంలో ఆలస్యంగా సమాచారం ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని వాచ్‌మెన్ మాత్రమే వెంట ఉండి చికిత్స పొందుతున్న విద్యార్థిని ఇప్పటి వరకు ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. తల్లిదండ్రులు, బంధువులు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా నిర్లక్షం చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత ప్రిన్సిపల్‌పై ప్రభుత్వం పెట్టింది కానీ ఇలాంటి నిర్లక్ష విధులు నిర్వహించే ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పుండ్ చేయాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.