Thursday, December 19, 2024

అలస్కా కు సునామీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలోని అలాస్కా వద్ద పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2 పాయింట్లుగా రికార్డు అయింది. అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాన్ని ఈ భూకంపం తాకిందని అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యుఎస్‌జిఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. భూకంపం తరువాత అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు వెలువరించారు. అలస్కాలోని శాండ్‌పాయింట్‌కు 98 కిలోమీటర్ల దూరంలో 32.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాలలో ప్రకంపనలు అలస్కా భూకంప కేంద్రం సంభవించినట్లు వెల్లడించారు. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు ఏమి వెలువడలేదు. అయితే తొలుత భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ తరువాత వీటిని ఉపసంహరించుకున్నారు.

అలస్కా, కుక్ ఇన్లెట్ ప్రాంతాలకు ఇటువంటి ముప్పేమీ లేదని భూకంప కేంద్రం తెలిపింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి భూమి కంపించింది. ముందు దీని తీవ్రతను 7.7గా పేర్కొన్నారు. తరువాత దీనిని తగ్గించి చూపారు. ముందు సునామీ హెచ్చరికలు వెలువడటంతో అలస్కా తీర ప్రాంతం వెంబడి ఉండే ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేశారు. సునామీ ఉండదని నిర్థారణ కావడంతో అంతా సద్ధుమణిగింది. అయితే సముద్ర ఉపరితలంలో స్వల్ప మార్పులు ఉంటాయని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని , ఎక్కడికక్కడ స్థానిక అత్యయిక విభాగం సన్నద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు. 1964 మార్చిలో అలస్కా ప్రాంతంలోనే భారీ భూకంపం 9.2 తీవ్రతతో సంభవించింది. అప్పుడు భూకంపం తదనంతర సునామీతో 250 మందికి పైగా మృతి చెందారు. భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఉత్తర అమెరికాలో ఇదే అతి పెద్ద భూకంపగా నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News