Monday, December 23, 2024

తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌లో ఘనంగా బోనాలు

- Advertisement -
- Advertisement -
హాజరైన కేబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్
అమ్మవారికి బోనం సమర్పించిన మొదటి మంత్రిగా రికార్డు
వీసా సమస్యల తలెత్తడంతో హాజరుకానీ ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేస్తున్న
ఎన్‌ఆర్‌ఐలకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్సీ

హైదరాబాద్: న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాలకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉండగా వీసా సమస్యల తలెత్తడంతో ఆమె ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు ఆదివారం తిరిగి వచ్చారు. అయితే ఈ బోనాలకు ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ కేబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ హాజరుకావడంతో మరింత ఉత్సాహాంతో అక్కడి ఎన్‌ఆర్‌ఐలు ఈ బోనాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక రాధాకృష్ణన్ అమ్మవారికి బోనం సమర్పించి రికార్డు సృష్టించారు.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు మరింత వన్నె: ఎమ్మెల్సీ కవిత
ఈ బోనాలకు కేబినెట్ మంత్రి హాజరుకావడంపై ఎమ్మెల్సీ కవిత సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మహిళలు ఘనంగా ఈ జరుపుకునే ఈ బోనాలకు అక్కడి ప్రజా ప్రతినిధులు హాజరై తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు మరింత జీవం పోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేస్తున్న ఎన్‌ఆర్‌ఐలను ఆమె అభినందించారు.
అమ్మవారికి బోనం సమర్పించిన కేబినెట్ మంత్రి
న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాపకుర గణేష్ ఆలయంలో తెలంగాణ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ క్యాబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్, పార్లమెంటు సభ్యురాలు హెలెన్ వైట్ మరియు పలువురు ప్రముఖ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాంకాళికి సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించారు. పూజారి చంద్రు, అతని బృందం నేతృత్వంలోని అర్చకుల ఆత్మను కదిలించే డోలు ప్రదర్శనలు, మంత్రముగ్ధులను చేసే మంత్రాల పఠనంతో సహా సాంస్కృతిక కోలాహలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేబినెట్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ హాజరు కావడం, చురుగ్గా పాల్గొనడం ఈ వేడుకకు మరింత ప్రాధా న్యతను సంతరించుకుంది. బోనాల కార్యక్రమానికి హాజరైనందుకు మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌కు న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
కేబినెట్ మంత్రి తొలిసారిగా పాల్గొనడం చరిత్ర: కళ్యాణ్‌రావు
బోనం సమర్పణలో కేబినెట్ మంత్రి తొలిసారిగా పాల్గొని చరిత్ర సృష్టించారని న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కళ్యాణ్ రావు కాసుగంటి పేర్కొన్నారు. ఏ దేశంలో ఏ మంత్రి కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదని ఇక్కడ ప్రియాంక రాధాకృష్ణన్ పాల్గొనడం మొదటిసారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అఖండ స్పందన లభించిందన్నారు. సుమారు 1000 మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్‌కు చెందిన కోర్ సభ్యులు రామ్ మోహన్ దంతాల, స్వాతి పయ్యరకాయ, కిరణ్ పోకల, లక్ష్మణ్ కలకుంట్ల , అశుతోష్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశారని ఆయన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News