Friday, December 20, 2024

హమ్ ఆప్‌కే హై… బెంగళూరు విపక్ష భేటీకి ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బెంగళూరులో సోమ, మంగళవారాలలో జరిగే ప్రతిపక్షాల భేటీకి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) హాజరు కానుంది. ఈ విషయాన్ని పార్టీ నేత రాఘవ ఛద్ధా ఆదివారం విలేకరులకు తెలిపారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశం ఆదివారం పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా అన్ని అంశాలను పరిశీలించుకుని, ప్రతిపక్ష భేటీకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఛద్ధా తెలిపారు. ఢిల్లీపై కేంద్ర ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తుందనే నిర్ణయం వెలువడ్డ దశలోనే ఆప్ పిఎసి భేటీ, ఇందులో విపక్షసమావేశానికి వెళ్లాలనే నిర్ణయం జరిగిందని వెల్లడైంది. కాంగ్రెస్ నిర్ణయం పట్ల ఆప్ హర్షం వ్యక్తం చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని సంఘటితంగా ఎదుర్కొవాలనే దిశలో బెంగళూరులో కీలకమైన మలి విడత ప్రతిపక్ష సమావేశం జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News