రామాయంపేట: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో ఆదివారం మహంకాళిమాత వార్షిబ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఆలయవేద పండితులు వేద మంత్రాలతో ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ ప్రజలను సుఖసంతోషాలతో ఉంచి పాడి పంటలు సమృద్దిగా పండి వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని వేడుకున్నారు.ఆలయ వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి శాలువతో ఘనంగాసత్కరించారు.
అనంతరం మహంకాళి మాత ఆలయ ప్రాంగణంలో, నల్ల పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో డప్పు చప్పుల్లతో పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి తొట్టెల, బోనాలను పురవీధులగుండా భారీ ఊరేగింపుతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, సరాఫ్ యాదగిరి, బాదే చంద్రం, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, వార్డు కౌన్సిలర్, నిజాంపేట జడ్పిటిసి పంజా విజయ్‌కుమార్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్‌కుమార్, మహంకాళి ఆలయ నూతన కమిటీ డైరెక్టర్లు, రామాయంపేట పట్టణ ప్రజలు పాల్గొని శ్రీ మహంకాళమ్మ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.