Sunday, January 19, 2025

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హత్నూర: గుర్తు తెలియని వాహనం ఢీకొని కార్మికుడు మృతి చెందిన ఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపూర్ గ్రామ సమీపంలో గల దాబా వద్ద నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై శనివార్‌ం రాత్రి జరిగింది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం,మయూర్ భంజ్ జిల్లా,భాహ్మని పాత గ్రామానికి చెందిన సానియా సింగ్ (33) గత రెండు నెలలుగా మండలంలోని గోవింద్ రాజ్ పల్లి గ్రామ శివారులో గల ఆర్డీ ఇండస్ట్రియల్ కార్బన్ కంపెనీలో కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నాడు.ఉద్యోగరీత్యా అక్కడే విధులు నిర్వహిస్తూ కంపెనీ ఏర్పాటు చేసిన గదుల్లో నివాసముంటున్నాడు.రాత్రి అందాజా 10:30 గంటలకు సానియా సింగ్ కు ఆక్సిడెంట్ జరిగిందని మృతుడు పని చేస్తున్న సూపర్ వైజర్ బాపి మోహపత్రకు ఫోన్ ద్వారా సమాచారం రావడంతో అతడు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సానియా సింగ్ తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే చనిపోయి ఉన్నాడు.గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టడంతో చనిపోయాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News